HomeTelugu Trending'ఖిలాడి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఖిలాడి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

khiladi release date

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’.రమేశ్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకొంటోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయనున్నారా? అని అందరూ వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా చిత్రబృందం రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విభిన్న యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలకపాత్రలు పోషించారు. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమైంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu