HomeTelugu Trendingవిజయ్‌ కు జోడిగా మహేష్‌ హీరోయిన్‌!

విజయ్‌ కు జోడిగా మహేష్‌ హీరోయిన్‌!

5 8అట్లి దర్శకత్వంలోని ‘బిగిల్‌’ సినిమాలో నటిస్తున్నారు విజయ్‌ దేవరకొండ. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 75 శాతం పూర్తయింది. ఈ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేయనున్నారు. దీనికి ‘తలబది 64’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను పెట్టారు. విజయ్‌కి జోడీగా రష్మిక, త్రిష పేర్లు వినిపించాయి. కానీ చివరకు ‘భరత్‌ అనే నేను’ ఫేమ్‌ కియారా అద్వానిని హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంలో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందీ సుందరి. ఇప్పుడు ఏకంగా విజయ్‌కు జోడీగా కోలీవుడ్‌లో అడుగు పెట్టనుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. విజయ్‌ బంధువు గ్జేవియర్‌ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu