HomeTelugu Trendingకిరణ్ అబ్బవరం 'మీటర్' ఫస్ట్‌లుక్‌

కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఫస్ట్‌లుక్‌

Kiran Abbavaram meter first
టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ రోజున ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ కొత్త ప్రాజెక్టుల నుంచి అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా మైత్రీ మూవీస్ వారు తమ బ్యానర్ లో కిరణ్ చేస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి ‘మీటర్’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇది పక్కా మాస్ ఎంటర్టయినర్ అనే విషయం అర్థమవుతోంది.

రమేశ్ కాడూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి, సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక కిరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ 2లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ .. కోడి దివ్య బ్యానర్లో ‘నేను మీకు చాలా కావాల్సినవాడిని’ చేస్తున్న సంగతి తెలిసిందే.

Meter Movie First Look

Recent Articles English

Gallery

Recent Articles Telugu