HomeTelugu Trendingనిర్మాతగా కోడి రామకృష్ణ పెద్ద కూతురు

నిర్మాతగా కోడి రామకృష్ణ పెద్ద కూతురు

Kodi ramakrishna daughter

లెజెండరీ డైరెక్టర్‌ కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్య, సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని నిర్మాతగా రంగంలోకి దిగారు. కిరణ్ అబ్బవరం హీరోగా ఆమె ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.ఈ రోజున కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకి కిరణ్ అబ్బవరం పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆయన చేసిన ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ వచ్చేనెలలో విడుదల కానుంది. ఇక ‘సెబాస్టియన్’ .. ‘సమ్మతమే’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడన్న మాట. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu