ఖాకీ నిక్కరులో ప్రియాంక చోప్రా


బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకొని న్యూయార్క్ వెళ్ళిపోయింది. అక్కడే సెటిల్ అయ్యి.. హాలీవుడ్, టీవీ షోలు చేస్తున్నది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఫెమస్ అయిన ఈ స్టార్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెడుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటె, ప్రియాంక చోప్రా తన రీసెంట్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఖాకీ నిక్కరు వేసుకున్న ఫొటోలో అచ్చంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నది. ఆర్ఎస్ఎస్ మీటింగ్ కు వెళ్లి వస్తున్న ప్రియాంకా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ కు ప్రియాంక ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.