HomeTelugu Trendingకోయిలమ్మ నటుడు అరెస్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

కోయిలమ్మ నటుడు అరెస్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

Koilamma serial actor arresకోయిలమ్మ సీరియల్‌ హీరో అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలం క్రితం స్నేహితులతో కలిసి మద్యం సేవించి… ఇద్దరు మహిళలపై సమీర్‌ దాడికి పాల్పడినట్టు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 5 లక్షల రూపాయలు తీసుకుని… తిరిగి చెల్లించమని అడిగినందుకు సమీర్‌ తమపై దాడి చేశాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. మణికొండలోని తమ ఇంటికి అనుచరులతో వచ్చి గొడవ చేశాడని కంప్లైంట్‌ ఇచ్చారు. దీంట్లో తన తప్పేమీ లేదని అమీర్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్‌ను బుధవారం అరెస్టు చేశారు. కూకట్‌పల్లి కోర్టు అతనికి రిమాండ్‌ విధించడంతో అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu