రజినీకాంత్‌ సినిమాలో విలన్‌గా ఆ స్టార్‌ హీరో!

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘జైలర్’. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్లో పెట్టుకుంటోన్నారు. ఇందులో భాగంగానే ఆయన తన 170వ చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేం టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నారు. రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం ఓ స్టార్ హీరోను తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు చియాన్ విక్రమ్ మొదట ఆసక్తి చూపించలేదని తెలిసింది. అయితే చిత్ర యూనిట్ అతడితో పలుమార్లు చర్చలు జరిపారని అంటున్నారు. దీంతో ఈ విలక్షణ నటుడు రజినీని ఢీ కొట్టే పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. దీంతో ఇది సౌతిండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్లలో ఒకటి కాబోతుంది అంటున్నారు.

ఇక ఈ భారీ చిత్రంలో రజినీకాంత్ – విక్రమ్ మధ్య బలమైన పోటీ ఉండేలా దర్శకుడు టీజీ జ్ఞానవేల్ పవర్ఫుల్ సీన్స్ను రాసుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ రెండు పాత్రలు సమానమైన నిడివి ప్రాధాన్యతతో కనిపించేలా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నానే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే అటు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటు చియాన్ విక్రమ్ ఫ్యాన్స్కు పండగే అని చెప్పొచ్చు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates