HomeTelugu Trendingమెగాస్టార్‌కి ఆ హీరోయిన్‌నే ఎంపిక చేసిన కొరటాల శివ..!

మెగాస్టార్‌కి ఆ హీరోయిన్‌నే ఎంపిక చేసిన కొరటాల శివ..!

8 13మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తవగానే ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెడుతారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై చర్చలు జరిపిన చిత్రబృందం చివరకు ప్రస్తుతం ‘సైరా’లో చిరు సతీమణిగా నటిస్తున్న నయనతారనే తీసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకున్నారట. అయితే వారింకా నయనతారను సంప్రదించలేదట. ఒకవేళ సంప్రదిస్తే నయన్ ఎలా స్పందిస్తుందో మరి. ఇకపోతే ఈ సినిమా కూడా కొరటాల గత చిత్రాల మాదిరిగానే సోషల్ మెసేజ్ కలిగిన కమర్షియల్ సినిమాగా ఉంటుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu