HomeTelugu Trending'టిల్లు' రొమాంటిక్‌ పోస్టర్‌.. 'గీతాంజలి' న్యూ ఇయర్‌ విషెస్‌

‘టిల్లు’ రొమాంటిక్‌ పోస్టర్‌.. ‘గీతాంజలి’ న్యూ ఇయర్‌ విషెస్‌

new posters from tillu squa

2024 కొత్త సంవత్సరం సందర్భంగా పలు పోస్టర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్‌లుగా న‌టించిన చిత్రం `టిల్లు స్క్వేర్‌` నుంచి కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌, రాధిక సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌ రొమాంటిక్ యాంగిల్ మ‌రింత హైలైట్ అవుతోంది. మ‌ల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 9 ఫిబ్ర‌వ‌రి 2024న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

దీంతో పాటు తెలుగు హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ అప్డేట్‌ కూడా వచ్చింది. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ‘గీతాంజలి’ సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. నాట్య కళాకారిణి లుక్‌లో అంజలి కనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu