‘ఆర్డీఎక్స్’ తో ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ !

పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు తెలియని కుర్రకారు ఉండదేమో.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది పాయల్. ‘ఆర్డీఎక్స్’ అనేది ఆ సినిమా టైటిల్. ఆదివారం పూజా కార్యక్రమాలతో చిత్రం లాంచ్ అయింది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను శంకర్ భాను అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ‘ఆర్డీఎక్స్’ అనే పవర్‌ ఫుల్ పేరు పెట్టుకున్న ఈ చిత్రంలోని కంటెంట్‌లో ఎంత పవర్ ఉంటుందో చూడాలి. అంతే కాకుండా పాయల్ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన నటిస్తోంది. వెంకటేష్ సరసన మరో మూవీలో నటిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates