ఎన్టీఆర్ తో కృష్ణవంశీ నిజమేనా..?

జనతాగ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తరుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వినాయక్, త్రివిక్రమ్ వంటి స్టార్ దర్శకులు బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ మరో ఆప్షన్ వెతుక్కున్నాడని, యువ దర్శకులతో సినిమా చేయనున్నాడని రకరకాల వార్తలు వినిపించాయి.

కానీ ఏ విషయంలో స్పష్టత రాలేదు. సింగం సిరీస్ ను రూపొందిస్తున్న దర్శకుడు హరి తో సినిమా చేయనున్నాడనే వార్తలు బలంగా వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు చేరాడు. నక్షత్రం సినిమాను డైరెక్ట్ చేస్తోన్న కృష్ణవంశీ తన తదుపరి సినిమా బాలకృష్ణతో చేయాల్సివుంది.

కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయే పరిస్థితి కలుగుతోందని.. దీంతో ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. నక్షత్రం సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.. దీని తరువాత కృష్ణవంశీ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటుందనేది తాజా వార్త. వీరిద్దరు కలిసి గతంలో ‘రాఖీ’ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే!