HomeTelugu Big Storiesనరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం

నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం

13 9దేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోడీతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్‌.. మోడీకి అభినందనలు తెలిపారు. ఈ వేడుకకు బిమ్‌స్టిక్‌ దేశాధినేతలతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కుమారస్వామి, దేవేంద్ర ఫడణవీస్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌, పళనిస్వామి, ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ దంపతులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ దంపతులు, రతన్‌టాటాతో పాటు సుమారు ఎనిమిది వేలమంది అతిథులు హాజరయ్యారు. ప్రస్తుతం మోడీ జట్టు సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం కొనసాగుతోంది.

స్వస్థలం: గుజరాత్, నియోజకవర్గం: వారణాసి
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ)లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ, శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రిగా ఎదిగిన మోడీ మహోన్నత శిఖరాలకు చేరారు. తాజాగా మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

నరేంద్ర మోడీతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కేంద్ర కేబినెట్‌ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

1. రాజ్‌నాథ్‌సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
2. అమిత్‌ షా (గుజరాత్‌)
3. నితిన్‌ జైరాం గడ్కరీ (మహారాష్ట్ర)
4. డీవీ సదానంద గౌడ (కర్ణాటక)
5. నిర్మలా సీతారామన్‌ (తమిళనాడు)
6. రాంవిలాస్‌ పాసవాన్‌ (బిహార్‌)
7. నరేంద్ర సింగ్‌ తోమర్‌ ( మధ్యప్రదేశ్‌)
8. రవిశంకర్‌ ప్రసాద్‌ (బిహార్‌)
9. హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ- పంజాబ్‌)
10. థావర్‌ చంద్‌గహ్లోత్‌ (మధ్యప్రదేశ్‌)
11. ఎస్‌.జయశంకర్‌ (తమిళనాడు)
12. రమేశ్‌ పోఖ్రియాల్‌ (ఉత్తరాఖండ్‌)
13. అర్జున్‌ ముండా (ఝార్ఖండ్‌)
14. స్మృతి జుబిన్‌ ఇరానీ (ఢిల్లీ)
15. హర్షవర్ధన్‌ (ఢిల్లీ)
16. ప్రకాశ్‌ జావదేకర్‌ (మహారాష్ట్ర)
17. పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర- ముంబయి)
18. ధర్మేంద్ర ప్రధాన్‌ ( ఒడిశా)
19. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఉత్తర్‌ప్రదేశ్‌)
20. ప్రహ్లాద్‌ జోషి (కర్ణాటక)
21. మహేంద్రనాథ్‌ పాండే (ఉత్తర్‌ప్రదేశ్‌ -వారణాసి)
22. అరవింద్‌ సావంత్‌ (మహారాష్ట్ర – ముంబయి)
23. గిరిరాజ్‌ సింగ్‌ (బిహార్‌)
24. గజేంద్రసింగ్‌ షెకావత్‌ (రాజస్థాన్‌)
25. సంతోష్‌ గాంగ్వర్‌ ( ఉత్తర్‌ప్రదేశ్‌)
26. రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ (హరియాణా)
27. శ్రీపాద్‌ యశోనాయక్‌ (గోవా)
28. జితేంద్ర సింగ్‌ (జమ్ము కశ్మీర్‌)
29. కిరణ్‌ రిజిజు (అరుణాచల్‌ ప్రదేశ్‌)
30. ప్రహ్లాద్‌ పటేల్‌ (మధ్యప్రదేశ్‌)
31. రాజ్‌కుమార్‌ సింగ్‌ (బిహార్‌)
32. హర్‌దీప్‌సింగ్‌ పూరీ (పంజాబ్‌)
33. మనసుఖ్‌ మాండవీయ (గుజరాత్‌)
34. ఫగ్గన్‌సింగ్‌ కులస్థే (మధ్యప్రదేశ్‌)
35. అశ్వినీకుమార్‌ చౌబే (బిహార్‌)
36. అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ (రాజస్థాన్‌)
37. వీకే సింగ్‌ (పంజాబ్‌)
38. కృషన్‌పాల్‌ గుర్జార్‌ (హరియాణా)
39. రావ్‌సాహెబ్‌ ధాన్వే (మహారాష్ట్ర)
40. జి.కిషన్‌ రెడ్డి (తెలంగాణ)
41. పురుషోత్తం రూపాలా (గుజరాత్‌)
42. రాందాస్‌ అథవాలే (మహారాష్ట్ర)
43. సాధ్వి నిరంజన్‌ జ్యోతి (ఉత్తర్‌ప్రదేశ్‌)
44. బాబుల్‌ సుప్రియో (పశ్చిమ బెంగాల్‌)
45. సంజీవ్‌ బాల్యన్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
46. సంజయ్‌ శామ్‌రావ్‌ (మహారాష్ట్ర)
47. అనురాగ్ ఠాకూర్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)
48. అంగడి సురేష్‌ చిన్నబసప్ప (కర్ణాటక)
49. నిత్యానంద్‌ రాయ్‌ (బిహార్‌)

Recent Articles English

Gallery

Recent Articles Telugu