HomeTelugu Trendingబాలీవుడ్ నటుడు 'కేఆర్కే' అరెస్ట్

బాలీవుడ్ నటుడు ‘కేఆర్కే’ అరెస్ట్

KRK arrested in mumbai airp

బాలీవుడ్ నటుడు, నిర్మాత, రచయిత కమల్ రషీద్ ఖాన్‌ ( కేఆర్కే)ను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ట్వీట్లు తరచూ వివాదాస్పదమవుతూ ఉంటాయి. బాలీవుడ్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అరెస్టయ్యారు.

2020లో ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్‌పై మలాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ప్రశ్నించేందుకు పోలీసులు ఆయనను ముంబై ఎయిర్ ‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను బొరివలీ కోర్టులో ప్రవేశపెడతారు. కేఆర్కే పలు హిందీ సినిమాలతోపాటు భోజ్‌పురి సినిమాల్లోనూ నటించారు. పలు సినిమాలు నిర్మించారు. బిగ్‌బాస్-3లోనూ పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu