HomeTelugu Trendingరవితేజ కొత్త సినిమా రేపే ప్రారంభం

రవితేజ కొత్త సినిమా రేపే ప్రారంభం

3 12మాస్ రాజా రవితేజ తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మరోకటి ముసలి క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్ ఆల్మొస్ట్ కంప్లీట్ కావొచ్చింది. ఈ సినిమా తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. దీపావళి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర చేస్తోంది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. హీరోగా రవితేజకు ఇది 66వ సినిమా. ఇందులో మాస్ రాజా మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో హిట్టైయిన సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu