HomeTelugu Trendingకారు ప్రమాదంపై కార్టూనిస్ట్‌ వ్యాఖ్యాలపై ఖూష్బూ కౌంటర్‌

కారు ప్రమాదంపై కార్టూనిస్ట్‌ వ్యాఖ్యాలపై ఖూష్బూ కౌంటర్‌

Kushboo car accident contro
సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నిజంగా జరగలేదని, కల్పితమని సదరు కార్టూనిస్ట్‌ ఖుష్బూను తప్పుపడుతూ తమిళంలో ట్వీట్‌ చేశాడు. ‘ఖుష్బూ గొప్ప నటి. ఈ ఫొటో దానికి సాక్ష్యం. దయచేసి ఉత్తమ స్క్రిప్టు కోసం ప్రయత్నించండి. ఈ ప్రమాదంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. కొన్ని ఫొటోల్లో ఖుష్బూ ముందు సీటులో కూర్చొని ఉన్నారు, మరికొన్నింటిలో వెనుక కనిపించారు’ అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌ చూసిన ఖుష్బూ అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలన్నారు.

నీకు ధైర్యం ఉంటే ఫేక్‌ రోడ్డు ప్రమాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నించు. చావు నీ ముఖంలో కనిపించిన ఆ క్షణం నువ్వు భయంతో వణికిపోతావు. ఎందుకంటే నాకున్న ధైర్యం నీకు లేదు. నువ్వు పిరికి వ్యాఖ్యలు చేస్తున్నావు. త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ఖుష్బూ ఆయనకు కౌంటర్‌ ఇచ్చింది. మరోపక్క తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఖుష్బూ అనుమానం వ్యక్తం చేశారు. ‘నేను బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌లోకి రావడం చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. కోట్లాది ప్రజల ప్రార్థనలు, ప్రేమ నాపై ఉన్నాయి కాబట్టి.. నేను బతికాను. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు నాపక్క ఉన్నారు. దేవుడి ఆశీర్వాదాలు నాకున్నాయి. బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌’ అని పరోక్షంగా తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu