HomeTelugu Trendingసీనియర్‌ హీరోయిన్‌తో రజనీ రొమాన్స్‌..

సీనియర్‌ హీరోయిన్‌తో రజనీ రొమాన్స్‌..

5 26సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమా షూటింగ్‌ ముగించేశారు. ఇక సినిమా విడుదల కావడమే ఆలస్యం. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను నిన్న బుధవారం విడుదల చేయగా, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ సినిమా తరువాత రజినీకాంత్ దర్శకుడు శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రారంభం కాబోతున్నది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ అనుకున్నారు. అయితే, ఇందులో ఓ సీనియర్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కాలా, పేట సినిమాల్లో సీనియర్లను తీసుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నారట. దానికోసం కుష్బూను అడిగారని, ఆమెకు రజినీతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రజినీతో కలిసి అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్ సినిమాల్లో నటించింది కుష్బూ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu