నెట్లో మరోసారి ‘టాక్సీవాలా’ పైరసీ!

‘గీత గోవిందం’ చిత్రంతో సూపర్‌ హిట్ కొట్టిన యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా సినిమా ‘టాక్సీవాలా’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన హీరోయిన్‌గా కొత్త అమ్మాయి ప్రియాంక నటిస్తుంది. ఈ నెల 17 న ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా కొద్దిరోజుల క్రితం ఇంటర్‌ నెట్లో ప్రత్యక్షమయింది. అనంతరం దాన్ని తీసేసారు. తాజాగా మళ్లీ ఈ సినిమా నెట్లో ప్రత్యక్షమయింది. అయితే ఈ సారి ఈ సినిమా లింక్ క్లిక్ చేసారో అంతే సంగతులు. లింక్ క్లిక్ చేస్తే వైరస్ ఎటాక్ అవుతుందట. ఈ వైరస్ దాటికి లాప్ టాప్స్, టాబ్స్, మొబైల్స్ అన్ని నాశనం అవుతున్నాయట. ముఖ్యంగా కొన్ని సైట్లలో ఈ సినిమాను డౌన్ లోడ్ చేసుకునే వారు ఈ వైరస్ బారిన పడ్డారట. సినిమా లింక్ కు బదులుగా.. వైరస్ లింక్ పెట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది.