‘లక్ష్మీ బాంబ్’ ఆడియో విడుదలకు సిద్ధం!

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ 5న సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ సంద‌ర్బంగా….
మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ”డిఫరెంట్ గా జడ్జ్ పాత్రలో కనపడతాను. ఇప్పటి వరకు చేయని చాలెంజింగ్ పాత్ర చాలా ఎగ్జయింటింగ్ గా ఉంది. సినిమాను  సింగిల్ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మ‌నోజ్ ఆధ్వర్యంలో చేశాం. డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను బాగా తెరకెక్కించారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి  సినిమాను దీపావళి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అన్నారు.
దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ”సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జయప్రదగారి జస్టిస్ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీగారే. మనోజ్ గారు క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారుఅక్టోబర్ 5న సినిమాను విడుదల చేసి మూవీని దీపావళి సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
 
CLICK HERE!! For the aha Latest Updates