HomeTelugu Trendingటాలీవుడ్ సీనియర్ హీరోపై విచిత్ర సంచలన ఆరోపణ

టాలీవుడ్ సీనియర్ హీరోపై విచిత్ర సంచలన ఆరోపణ

Vichitra comments
Bigg Boss Vichitra: బిగ్ బాస్(తమిళం) కంటెస్టెంట్ విచిత్ర తాజాగా సినీ పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. తాను వేధింపులకు గురయ్యానంటూ సినిమా సెట్‌లో హీరో, ఫైట్ మాస్టర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేసింది. ఆ ఘటనతో చివరకు ఇండస్ట్రీకే దూరంగా ఉండిపోయిందట.

సినీ ఇండస్ట్రీలో వేధింపులు జరిగాయి, జరుగుతున్నాయని ఇప్పటికే అనేకమంది ఆరోపించారు. ఇంకా చాలామంది వాళ్ల సమయం వచ్చినప్పుడు బయట పెడుతూనే ఉన్నారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ మీద తమిళంలో చిన్మయి, చాలా మందే బయటకు వచ్చి వెల్లడించారు.

Vichitra 2

శ్రీరెడ్డి సైతం మీటూ గురించి చెప్పింది. అయితే పెద్ద స్టార్ హీరోయిన్లు మాత్రం అలాంటివి ఉండవని, ఏదైనా మన చేతుల్లోనే ఉంటుందని, మన హద్దుల్లో మనం ఉంటే ఏం జరగదని, ఇష్టం లేకుండా అయితే ఎవరూ ఏం చేయరు కదా? అని అంటుంటారు.

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్, తమిళ నటి విచిత్ర ఈ వేధింపులపై నోరు విప్పింది. తనకు జరిగిన ఘటన మీద మొదటి సారిగా అందరికీ తెలిసేలా చెప్పింది. బిగ్ బాస్ తమిళ్ ప్రస్తుతం ఏడో సీజన్లో విచిత్ర చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

నవంబర్ 21న జరిగిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీనికి సమాధానంగా విచిత్ర మాట్లాడుతూ..

22 ఏళ్ల క్రితం నేను టాలీవుడ్ మూవీలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఓ అటవీ ప్రాంతంలో జ‌రిగింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసింది.

పార్టీ ముగిసిన తర్వాత సినిమా హీరో నా దగ్గ‌ర‌కు వ‌చ్చి నన్ను డైరెక్ట్‌గా తన గదికి రమ్మన్నాడు. దాంతో ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తరువాత నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్‌లొ పాల్గొన్నప్పటినుంచి అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నాను.

ఆ త‌రువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయిందని, పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని విచిత్ర తెలిపారు. అయితే విచిత్ర‌ మాత్రం ఆ హీరో పేరు ఎక్కడా వెల్ల‌డించ‌లేదు. ఏ హీరో అలా అన్నాడు? ఏ సినిమా సెట్‌లో ఇది జరిగింది? అంటూ నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu