HomeTelugu Trendingరజనీకాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారు: లతా రజనీకాంత్‌

రజనీకాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారు: లతా రజనీకాంత్‌

Latha rajinikanth reacts on
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్‌ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సతీమణి తెలిపారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్‌ బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’చిత్రాన్ని కుటుంబ సభ్యుల మధ్య తిలకించారు. గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు పొక్కడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

దీనిపై రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌ స్పందిస్తూ.. ‘‘రజనీకాంత్‌ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే’’ అని పేర్కొన్నారు. ఆయన కొన్ని గంటల తర్వాత ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu