HomeTelugu Trendingరానా సినిమాలో నాగార్జున హీరోయిన్‌

రానా సినిమాలో నాగార్జున హీరోయిన్‌

6 17దగ్గుబాటి రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తరువాత తెలుగులో కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు చేశాడు. ఈ రెండింటిలో గెస్ట్ రోల్స్ మాత్రమే. స్ట్రెయిట్ హీరోగా చేసిన హిందీ, తమిళ, మలయాళం సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇదిలా ఉంచితే… తెలుగులో రానా విరాట పర్వం 1992 సినిమా చేస్తున్నాడు. నీది నాది ఒకటే కథ దర్శకుడు వేణు అడుగుల దర్శకత్వంలో రానా ఈ సినిమా చేస్తున్నాడు. 1992 బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది.

ఇదిలా ఉంటె, విరాటపర్వం 1992 లో ఓ సీనియర్ నటి నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ పాత్ర కోసం తెలంగాణా కాంగ్రెస్ నాయకురాలు విజయ్ శాంతిని అనుకున్నారట. కానీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ప్లేస్ లో టబును తీసుకున్నారని తెలుస్తోంది. టబు నాగార్జునతో నిన్నేపెళ్ళాడుట వంటి హిట్ సినిమాలు చేసింది. 2008 లో వచ్చిన పాండురంగడు తరువాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత మరలా టబు టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. బన్నీ త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేసేందుకు టబు ఇప్పటికే అంగీకరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu