HomeTelugu Trendingగోపీచంద్‌కు నో చెప్పిన సాయిపల్లవి.!

గోపీచంద్‌కు నో చెప్పిన సాయిపల్లవి.!

6 3ఎంత పెద్ద ఆఫర్‌ అయిన కథ నచ్చితేనే ఒప్పుకుంటుంది సాయిపల్లవి. లేకపోతే, ఏమాత్రం మొహమాటం లేకుండా తిరస్కరిస్తుంది. ఎంత ఎక్కువ పారితోషికం ఇచ్చిన కమిట్‌ అవ్వదు ఈ బ్యూటీ. తాజాగా అటువంటి ఓ భారీ ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు తేజ త్వరలో యాక్షన్ హీరో గోపీచంద్ తో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ‘అలిమేలుమంగ వెంకటరమణ’ పేరుతో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం ఇటీవల సాయిపల్లవిని తేజ సంప్రదించాడట. అయితే, తేజ చెప్పిన కథ, పాత్ర ఆమెకు నచ్చకపోవడంతో వెంటనే ఆమె ‘నో’ చెప్పేసిందని అంటున్నారు. దీంతో ఈ పాత్రకు ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu