HomeTelugu Trendingరజనీకాంత్‌కు విలన్‌గా లారెన్స్‌?

రజనీకాంత్‌కు విలన్‌గా లారెన్స్‌?

Lawrence as villain for Raj

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీని తరువాత తలైవర్ 170 సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతో పాటు తలైవర్ 171 కూడా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో తమిళ నటుడు రాఘవ లారెన్స్​ విలన్​గా నటించబోతున్నారని టాక్‌.

లోకేశ్​ కనగరాజ్ రజనీకాంత్‌ 171 డైరెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎల్​సీయూలో భాగంగా కాకుండా స్టాండ్​అలోన్​గా తెరకెక్కించబోతున్నారు లోకేశ్​. తాజగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్​గా రాఘవ లారెన్స్ నటిస్తున్నారనే వార్త తమిళ్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది.

స్వతహాగానే రజిని అభిమాని అయిన లారెన్స్.. రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నానని చాలా చెప్పారు. ఇప్పుడు లోకేశ్​ కనగరాజ్.. రజినీతో చేస్తున్న సినిమాలో ఒక పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ ఆఫర్ ఇచ్చారని, ఇక రజినీతో సినిమా అనగానే విలన్ రోల్ అయినా సరేనని లారెన్స్ ఓకే చెప్పారని కథనాలు వస్తున్నాయి. మరి దీనిలో నిజం ఎంత ఉందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu