మెగాఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ!

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఇప్పటికే చాలా మంది హీరోలు పరిశ్రమలో ఉన్నారు. తాజాగా ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడ ‘విజేత’ సినిమాతో హీరోగా మారగా ఇప్పుడు చిరు మేనల్లుడు, ప్రస్తుత హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడ వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఇద్దరూ కలిసి ఇతని డెబ్యూ చిత్రాన్ని నిర్మించనున్నారు. బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.