HomeTelugu Trendingలారెన్స్‌ బాలీవుడ్‌ ఎంట్రీ..!

లారెన్స్‌ బాలీవుడ్‌ ఎంట్రీ..!

3 24కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన లారెన్స్‌.. తనలోని ప్రతిభను చాటుకున్నారు. దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు.. ఇలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. తన స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంచన’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా బాలీవుడ్‌లోకి వెళ్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. ఇక శరత్‌కుమార్‌ పాత్ర కోసం ఓ ప్రముఖ బాలీవుడ్‌ హీరోతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu