HomeTelugu Trending'లోల్‌ సలామ్‌' ట్రైలర్‌

‘లోల్‌ సలామ్‌’ ట్రైలర్‌

LOL Salaam Trailer
‘లోల్ సలామ్’ పేరుతో ఫన్ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ తాజాగా టాలీవుడ్ హీరో నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ ఫన్ ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందంటూ తెలిపాడు. ఈ ట్రైలర్ చూస్తే చాలా ఫన్నీగా పూర్తి హాస్యపూరిత సన్నివేశాలు పుస్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. యువదర్శకుడు నాని – పూర్తిగా కొత్తవాళ్ళతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఐదుగురు కొత్తగా లీడ్ రోల్స్ తో పాటు 40మంది న్యూ ఆర్టిస్ట్ లను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన తారాగణం చూస్తే.. భరద్వాజ్, శ్రీనివాస్ రెడ్డి, దరాహాస్ మాథుర్, కివిష్ కౌటిల్య, రోహిత్ కృష్ణ వర్మ, పవన్ కుమార్, పద్మిని సెట్తం, ప్రవీణ, గాయత్రి, ఐశ్వర్య బాలా కనిపించనున్నారు. అయితే ఈ లోల్ సలామ్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ జీ5లో జూన్ 25నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu