చైనాలో గ్లాస్ బ్రిడ్జి.. పర్యాటకుల్లో మృత్యుభయం.. వైరల్‌

మహాభారతంలో దుర్యోధనుణ్ని ఆశ్చర్యపరచిన మయసభను చూశాం. అదే స్ఫూర్తితో చైనాలోని ఝంగ్జియాజిలో గ్లాస్ బ్రిడ్జి నిర్మించారు. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో రెండు కొండల్ని కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ బ్రిడ్జి ప్రత్యేకత ఏంటంటే.. నడుస్తుంటే కాళ్ల కింద గ్లాసు పగిలిన ఎఫెక్ట్ ఇస్తుంది. సౌండ్ కూడా అలాగే ఉండడం వల్ల నడిచేవారు జడుసుకుంటారు. ముఖంలో మృత్యుభయం కూడా కనిపిస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.