HomeTelugu Trendingసత్యదేవ్‌తో తమన్నా..

సత్యదేవ్‌తో తమన్నా..

Tamannaah with sathya dev

టాలీవుడ్‌లో సమంత ‘యూ టర్న్‌’ సినిమా తర్వాత మనవాళ్ల చూపు కన్నడ ఇండస్ట్రీ పై పడింది. తాజాగా మరో కన్నడ చిత్రం టాలీవుడ్‌కి వస్తోంది. ఈ ఏడాది మొదట్లో విడుదలై మంచి విజయం అందుకున్న’లవ్‌ మాక్‌టైల్‌’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ప్రముఖ హీరోయిన్‌ తమన్నా, యువ నటుడు సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో నటించ బోతున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై భావన రవి నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది. నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ సెప్టెంబర్ మధ్య వారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తుండగా… సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

కన్నడ ‘లవ్‌ మాక్‌టైల్‌’ ను కృష్ణ స్వీయ డైరెక్షన్‌లో నటిస్తూ నిర్మించారు. ఇందులో మిలనా నాగరాజ్‌, అమృత అయ్యంగర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు రూ.రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ.ఐదు కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇందులో నటనకుగాను ప్రధాన పాత్రధారులకు మంచి పేరు వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu