HomeTelugu Trending'అనుభవించు రాజా' ట్రైలర్‌

‘అనుభవించు రాజా’ ట్రైలర్‌

Anubhavinchu raja trailer

టాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం “అనుభవించు రాజా”. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా రాజ్‌ తరుణ్‌ ఉన్నాడు. కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి చిత్రబృందాన్ని విష్ చేశారు. సినిమాలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో, రెండవది సిటీలో జరుగుతుంది. విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు.

సిటీ కామెడీ కథలో హీరో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేయడం, అదే కంపెనీలో పని చేస్తున్న హీరోయిన్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం వంటి సన్నివేశాలు మరో కోణం. ట్రైలర్ పూర్తిగా ఉల్లాసంగా ఉంది. శ్రీను గవిరెడ్డి ‘అనుభవించు రాజా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్విసి ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!