HomeTelugu Trending'లవ్‌ స్టోరీ' టీజర్‌

‘లవ్‌ స్టోరీ’ టీజర్‌

Love Story Movie Teaser
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘లవ్‌ స్టోరీ’. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్లను చిత్ర యూనిట్‌ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ‘లవ్‌ స్టోరీ’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu