HomeTelugu Trending'మా ఊరి పొలిమేర 2' రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

‘మా ఊరి పొలిమేర 2’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

Maa oori polimera 2 releas

టాలీవుడ్‌ నటుడు సత్యంరాజేశ్‌, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. డాక్టర్ అనిల్‌ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరోసారి అందరికీ థ్రిల్‌ అందించేందుకు సీక్వెల్‌ మా ఊరి పొలిమేర 2 రెడీ అవుతోంది.

ఈ సినిమాలో గెటప్‌ శీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహిత్య దాసరి, రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పాపులర్ డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్టు సమాచారం. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత గౌరీ కృష్ణ తెలిపారు.

పల్లెటూరి నేపథ్యంలో బ్లాక్‌ మ్యాజిక్‌ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేశామన్నాడు. సత్యం రాజేష్, కామాక్షి అద్భుతంగా నటించారని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu