HomeTelugu Trendingమంచు విష్ణు కీలక నిర్ణయం

మంచు విష్ణు కీలక నిర్ణయం

Untitled 1Maa president man

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామాలు చేయొద్దని, పంపిన లేఖలు వెనక్కి తీసుకోవాలని తాము ఇప్పటికే ఆ సభ్యులను కోరినప్పటికీ వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదిస్తున్నానని తెలిపారు. మరోవైపు, ఈ 11 మంది స్థానాల్లో తన ప్యానల్‌ నుంచి ఓడిపోయిన 11 మంది సభ్యుల్ని తీసుకునే ఆలోచనలో విష్ణు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం జరిగిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. విష్ణు ప్యానల్‌ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని ఆనాడే ప్రకటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu