శివకార్తికేయన్‌కు జంటగా డైరెక్టర్‌ శంకర్‌ కూతురు


కోలీవుడ్ హీరో శివ‌కార్తికేయ‌న్ ఇటీవ‌లే ‘మావీర‌న్’ సినిమాని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో మ‌హావీరుడు టైటిల్‌తో తెర‌కెక్కుతోంది. మ‌డొన్నే అశ్విన్ క‌థనందిస్తూ డైరెక్ష‌న్ చేస్తున్న ఈ చిత్రం క్రేజీ అప్‌డేట్‌తో వైరల్‌ అవుతుంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూతురు అదితి శంక‌ర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫైన‌ల్ అయింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్రక‌టించారు.

అదితి శంక‌ర్ డెబ్యూ చిత్రం విరుమాన్ ఆగ‌స్టు12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. మొద‌టి సినిమా విడుద‌ల కాక‌ముందు రెండో సినిమా అప్‌డేట్ అందించి.. శంకర్ అభిమానుల్లో జోష్ నింపుతోంది అదితి. ఈ సినిమాలో ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నున్నారు మేకర్స్. శాంతి టాకీస్ బ్యాన‌ర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భ‌ర‌త్ శంక‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

నా తదుపరి చిత్రం మావీరన్‌ని ప్రకటించినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నా..గౌరవంగా భావిస్తున్నాశివ కార్తికేయన్‌ సార్‌, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మ‌డొన్నే అశ్విన్ సార్ కాంబినేష‌న్‌లో రాబోతుంది..అంటూ ట్వీట్ చేసింది అదితి శంక‌ర్.

CLICK HERE!! For the aha Latest Updates