HomeTelugu Trending'నేను స్టూడెంట్‌ సర్‌' మాయే మాయే ఫుల్ లిరికల్

‘నేను స్టూడెంట్‌ సర్‌’ మాయే మాయే ఫుల్ లిరికల్

Maaye Maaye Lyrical from Ne
యంగ్‌ హీరో బెల్లంకొండ గణేశ్‌, అవంతిక దస్సానీ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల చేసిన మాయే మాయే సాంగ్ ప్రోమో మ్యూజిక్‌ లవర్స్‌ ను ఇంప్రెస్ చేస్తూ సాగుతుంది.

తాజాగా మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. హీరోహీరోయిన్లు గణేశ్‌, అవంతిక సాగే జర్నీ నేపథ్యంలో వచ్చే ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తునడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సాంగ్ లిరికల్‌ వీడియో లింక్‌ను షేర్ చేశాడు.

ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా.. కపిల్‌ కపిలన్‌, మహతి స్వరసాగర్ ఈ సాంగ్ పాడారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని హీరోయిన్ తండ్రి అర్జున్‌ వాసుదేవన్‌గా అనే పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనుండగా..సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu