HomeTelugu Trendingకరోనాను జయించిన అమితాబ్‌.. ఆనందంలో ఫ్యాన్స్‌

కరోనాను జయించిన అమితాబ్‌.. ఆనందంలో ఫ్యాన్స్‌

Amitabh discharged from hosబాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత మూడు వారాలుగా ముంబై నానావతి హాస్పిటల్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా వచ్చింది. అయితే ఇప్పటికే పాప, ఐశ్వర్యలకు నయం అయిపోయింది. ఇప్పటికీ అమితాబ్, అభిషేక్‌ బచ్చన్ మాత్రం హాస్పిటల్‌లోనే ఉన్నారు. దాంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అభిషేక్ బచ్చన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.

తాజాగా చేసిన టెస్టులో అమితాబ్ బచ్చన్‌కు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని.. ఆయన్ని డిశ్చార్జ్ చేసారని చెప్పాడు. ఇకపై ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాడని ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు నమస్కారం చేసాడు అభిషేక్. అయితే తన ఆరోగ్యం విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అని తెలిపాడు. బిగ్‌ బీ ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu