HomeTelugu Trending‘మాచర్ల నియోజకవర్గం’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘మాచర్ల నియోజకవర్గం’రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Macherla NiyojakavargamRele
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం విభిన్న యాక్షన్‌ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శకనిర్మాతలు తాజాగా ప్రకటించారు. 2022 ఏప్రిల్‌ 29 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని పంచుకుంటూ ‘ఈసారి థియేటర్‌కే వచ్చేది.. బంపర్‌ మెజారిటీతో’అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా సందడి చేయనుంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu