HomeTelugu Newsడైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హీరో మాధవన్‌..?

డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హీరో మాధవన్‌..?

7 17కోలీవుడ్ నటుడు మాధవన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత విలన్ గా మారి భయపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోను మాధవన్ కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మాధవన్ స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రి.. నంబి ఎఫెక్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మాధవన్ టైటిల్ రోల్ చేయడమే కాకుండా.. కో డైరెక్టర్ గా కూడా చేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఆ తరువాత అప్డేట్ లేదు. ఈ సినిమా గురించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా దర్శకుడు అనంత్ మహదేవన్ కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ను మాధవన్ డీల్ చేస్తున్నాడట. కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి మెగాఫోన్ పట్టుకున్నాడు. సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మాధవన్ అండ్ కో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu