ఎవడు కాంబినేషన్‌ రిపీట్‌..!

మెగా హీరో రామ్‌చరణ్ రంగస్థలం హిట్టయ్యాక .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బోయపాటి సినిమా తరువాత చరణ్ ఎవరి సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు రామ్‌ చరణ్ నెక్స్ట్ సినిమాపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్ కు ఎవడు వంటి బెస్ట్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ సినిమా సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం. ఇటీవలే వంశీ చరణ్ కు ఓ కథను వినిపించారని, కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టుగా చరణ్ అన్నట్లు తెలుస్తున్నది. వంశీ ప్రస్తుతం మహేష్ బాబుతో మహర్షి చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక చరణ్ సినిమాను టేకప్ చేస్తారని సమాచారం. చరణ్ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు.. మిగతా విషయాలు ఏమిటనే సమాచారం త్వరలోనే బయటకు రానుంది.