HomeTelugu Trending'మాస్ట్రో' చివరి షెడ్యూల్‌ ప్రారంభం

‘మాస్ట్రో’ చివరి షెడ్యూల్‌ ప్రారంభం

Maestro final shooting st

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ చాలావరకు పూరైంది. చివరి షెడ్యూల్ చేయాలని అనుకుంటూ ఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. దాంతో ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. ఇక ఇప్పుడు కరోనా ఉద్రితి తగ్గడంతో ఈ సినిమా టీమ్ చకచకా రెడీ అయింది. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ రోజు (సోమవారం) ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

హిందీలో హిట్ కొట్టిన ‘అంధాదూన్’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నభా నటేశ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu