HomeTelugu Trendingప్రభాస్‌ డైరెక్టర్‌ నిశ్చితార్ధం.. ఫొటోలు

ప్రభాస్‌ డైరెక్టర్‌ నిశ్చితార్ధం.. ఫొటోలు

7 10
‘రన్ రాజా రన్’తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు సుజిత్. మొదటి సినిమాతోనే అందిరి దృష్టిలో పడ్డా ఆయనకు అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌ తీసిన అనుభవం మాత్రమే ఉంది. ఆతరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్.. ‘సాహో’ సినిమా చేసి సినీ ఇండస్ట్రీని ఆశ్యర్యపరిచేలా చేశాడు సుజిత్‌. రొటీన్ గాడ్ ఫాదర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సాహో సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచినా… డైరెక్టర్‌గా సుజిత్ మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించబోయే ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌కు సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్నాడు. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్ధం గోల్కొండ రిసార్ట్స్‌లో కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది. ఇక సుజిత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక విషయాకిస్తే.. ఈమె వృత్తి రీత్యా డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాదు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తోందట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.

7a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu