HomeTelugu News'మహానాయకుడు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘మహానాయకుడు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

9 12నందమూరి తారక రామారావు జీవితాధారంగా బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘ఎన్టీఆర్‌.’ ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం ‘కథానాయకుడు’ ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని చిత్ర బృందం తొలుత ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన పనులు అనుకున్న తేదీకి పూర్తికాకపోవడంతోనే సినిమా విడుదలను వాయిదా వేశారట. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ముహూర్తం పెట్టింది.

ఎన్‌.బి.కె ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం ‘కథానాయకుడు’ లో ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకటన వరకూ చూపించారు. రెండో భాగం ‘మహానాయకుడు’ లో ఆయన ఎలా పార్టీని స్థాపించారు? ప్రజాదరణతో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? తదితర పరిణామాలను చూపించనున్నారు. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు పాత్రలో రానా ఎలా మెప్పించారో ఇందులో చూడవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu