షార్ట్ ఫిల్మ్ లో లక్ష్మీమంచు!

శ్రీను పండ్రంకి దర్శకుడిగా ‘ది డెసిషన్’ అనే లఘు చిత్రాన్ని రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించారు. 21 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రం వాషింగ్టన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఒక మహిళ తన జీవితంలో క్లిష్టమైన నిర్ణయం ఎలా తీసుకుందనే నేపధ్యంలో సాగే కథ. ఈ లఘుచిత్ర ప్రదర్శన గురువారం హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సంధర్భంగా.. 
మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ”ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించడం చాలెంజింగ్ గా అనిపించింది. ఒక తల్లిగా నేను ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన చిత్రమిది. ఎమోషనల్ గా నాకు దగ్గరైన షార్ట్ ఫిల్మ్ ఇది” అన్నారు. 
దర్శకుడు శ్రీను మాట్లాడుతూ.. ”ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథ ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని 
రూపొందించాను. చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు” అన్నారు. విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.