ఎవరెస్టు అంచున మహేశ్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మహర్షి మే 9 వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు సింగిల్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. మహేశ్‌ ను ఇంట్రడ్యూస్ చేసే సాంగ్ ఒకటికాగా రెండోది స్నేహం గురించి చెప్పే సాంగ్. ఈ రెండు సాంగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇదిలా ఉంటె, మహర్షిలోని మూడో సింగిల్ ఎవరెస్టు అంచున అనే సాంగ్ ను ఏప్రిల్ 19 వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు వంశి పైడిపల్లి స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఎవరెస్టు అంచున సాంగ్‌కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది.