HomeTelugu Trendingసూర్య సినిమాపై మహేష్‌ ప్రశంసలు

సూర్య సినిమాపై మహేష్‌ ప్రశంసలు

Mahesh babu praises suryaతమిళ స్టార్‌ హీరో సూర్య తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పై సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. సుధ కొంగర డైరెక్షన్‌ లో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఆకాశం నీ హద్దురా స్ఫూర్తిదాయకమైన సినిమా. అద్భుత‌ దర్శకత్వం, అద్భుతమైన పెర్ఫామెన్స్‌, సూర్య గొప్పగా నటించాడు. చిత బృందం మొత్తానికి అభినందనలు’ అని ట్వీట్ చేశాడు మహేష్‌‌. మహేష్‌ ప్రశంసలపై హీరో సూర్య స్పందిస్తూ.. తమ సినిమాపై ప్రశంసలు చేసినందుకు మహేష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మహేష్‌ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారిపాట’ సినిమా కోసం ఎదురుచూస్తున్నామని సూర్య పేర్కొన్నాడు. ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారు వారిపాట సినిమా ప్రారంభించేందుకు రెడీ అతున్నారు.

‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu