HomeTelugu Reviews'సార్‌' మూవీ రివ్యూ

‘సార్‌’ మూవీ రివ్యూ

Sir Movie Review

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌కి టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకున్నాయి. రఘవరన్‌ Btech, మారి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరీంత చేరువయ్యాడు ధనుష్‌. పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్న ధనుష్‌.. బాలీవుడ్‌లో గ్రే మ్యాన్‌ మూవీ చేసి ఇంటర్నేషనల్‌ స్ధాయికి ఎదిగిపోయాడు. అయితే మొదటి సారిగా తెలుగులో ‘సార్’ సినిమా చేశాడు.

ఈ సినిమా తమిళంలో ‘వాతి’ పేరు విడులైంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. పైగా ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడంతో ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి. ఫ్రీమియర్‌ షోస్‌ కే థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..

ధనుష్‌.. బాల‌గంగాధర తిల‌క్ అలియాస్ బాలు ఒక జూనియర్‌ లెక్చరర్‌. ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో పని చేస్తాడు. త్రిపాఠి ప్రైవేట్‌ విద్యా సంస్థల చైర్మన్‌ ఓ పథకం ప్రకారం అతన్ని ప్రభుత్వ పాఠశాలకు లెక్కల మాస్టారుగా పంపిస్తాడు. అప్ప‌టికే ఆ కాలేజీలో బ‌యాల‌జీ టీచ‌ర్ మీనాక్షి (సంయుక్తా మీన‌న్‌) ప‌ని చేస్తుంటుంది. కాలేజీకి వెళ్లిన బాలు అక్క‌డ పరిస్థితిలను అర్థం చేసుకుంటాడు.

Sir Movie2

స్టూడెంట్స్ త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌లును చ‌దువు కోసం కాలేజీకి పంపడం కంటే ప‌నికి పంపడం మంచిద‌ని అనుకుంటుంటారు. అప్పుడు బాలు వారిలో ఎలా మార్పు తీసుకొచ్చాడు? దీనివల్ల అతనికి ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు. బాలు చేసిన ప‌ని వ‌ల్ల త్రిపాఠి (స‌ముద్ర ఖ‌ని)కి వ‌చ్చిన న‌ష్ట‌మేంటి? అనే అంశాలు పై ఈ సినిమా నడుస్తుంది.

లెక్చరర్‌ పాత్రలో ధనుష్‌ ఒదిగిపోయాడు. అతని చుట్టూనే సినిమా మొత్తం తిరుగుంది. ధనుష్‌ యాక్షన్‌, ఎమోషన్‌ కూడా చక్కగా బ్యాలెన్స్‌ చేశాడు. హీరోయిన్‌ సంయుక్త పాత్ర కూడా ఓకే. సీనియర్‌ నటుడు సాయి కుమార్‌ తన పాత్రలో మెప్పించాడు. సముద్ర ఖని విలన్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా నటులందరూ తమ పరిది మేరకు నటించారు.

Sir Movie1

ఇక ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారంగా మారింది.. చదువుని అడ్డు పెట్టుకుని ప్రజల బలహీనతతో ఆడుకుంటూ కొందరు ఎలా కోట్లు సంపాదిస్తున్నారు అనే అంశాలని దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాడు. ఎక్కడా అశ్లీలత లేకుండా తాను చెప్పాలి అనుకున్న పాయింట్‌ని చక్కగా ప్రజెంట్‌ చేశాడు.

సినిమాలో ట్విస్టులు, ట‌ర్నులు ఉండ‌వు. ఆడియెన్స్‌ ఊహించిన‌ట్లే సినిమా సాగుతుంది. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీన్స్ బాగానే ఉన్నాయి. అయితే ఫ‌స్టాఫ్ సో సోగానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ ల‌వ్ ట్రాక్ ఆక‌ట్టుకునేలా లేదు. ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ త్రీ ఇడియట్స్ వంటి ఈసినిమాలను గుర్తు చేస్తాయి. కొన్ని డైలాగ్స్‌ మాత్రం ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. సంగీతం బాగుంది. మాస్టారు.. మాస్టారు పాట బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

టైటిల్‌ :’సార్‌’
నటీనటులు: ధనుష్, సంయుక్తా మీనన్, సముద్ర ఖని, సాయి కుమార్,సుమంత్ తదితరులు
దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్ర‌కాష్

చివరిగా: సార్‌ ‘సందేశం’ బాగుంది

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu