త్వరలోనే మహేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ సినిమా విడుదల తరువాత మహేష్ బాబు కొన్ని రోజులు సెలవులు తీసుకొని విదేశాలకు వెళ్ళబోతున్నారు. లాంగ్ ట్రిప్ అని తెలుస్తోంది. ఈ ట్రిప్ తరువాత మహేష్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కేజేఎఫ్ ఫస్ట్ పార్ట్ భారీ హిట్ కొట్టడంతో పార్టీ 2 తీస్తున్నారు. పార్టీ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటం వలన షూటింగ్ ఆలస్యం జరిగింది. ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ తో సినిమా చేస్తున్నారని సమాచారం. మహేష్ తో ప్రశాంత్ చేయబోతున్న సినిమా బాలీవుడ్ సినిమా అని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా దీన్ని తీయబోతున్నారని సమాచారం.