HomeTelugu Big Storiesచిరంజీవి 'సైరా' ట్రైలర్‌ పై మహేష్‌ ట్వీట్‌

చిరంజీవి ‘సైరా’ ట్రైలర్‌ పై మహేష్‌ ట్వీట్‌

13 11టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం ట్రైలర్ నిన్నటి రోజున విడుదల అయ్యింది. యూట్యూబ్ లో రిలీజైన క్షణం నుంచి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో 34 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. విజువల్ వండర్ గా ట్రైలర్ ఉంది. ఇక మెగాస్టార్ తన నటవిశ్వరూపాన్ని సినిమాలో చూపించాడు. మరోవైపు సూపర్ స్టార్ అమితాబ్ సినిమాలో కీలక పాత్ర చేస్తుండటం బాలీవుడ్ లో రిలీజ్‌కు అనుకూలంగా మారింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కాబోతున్నది. ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు స్పందించారు. ట్రైలర్ విజువల్ వండర్ గా ఉందని, ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. చిరంజీవి యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పిన మహేష్, అమితాబ్, చరణ్, సురేందర్ రెడ్డి, డీవోపీ రత్నవేలుకు అలాగే యూనిట్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu