HomeTelugu Big Storiesకృష్ణ మెమోరియల్‌ ఏర్పాటుకు సన్నాహాలు!

కృష్ణ మెమోరియల్‌ ఏర్పాటుకు సన్నాహాలు!

This unfulfilled wish of Krishna becomes a hot topic
సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు కృష్ణ. సినీ జనాల కోసం కృష్ణ మెమోరియల్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త వస్తున్నాయి. త్వరలో ఘట్టమనేని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో సూపర్‌ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మెమోరియల్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంతోపాటు ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, ఇతర విశేషాలను ప్రతిబింబించేలా మహేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా తెలుగు చలనచిత్రపరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు కృష్ణ. నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్‌ ద్వారా సక్సెస్‌ పుల్‌ చిత్రాలను నిర్మించారు.

సాధారణ నటుడి నుంచి సూపర్‌స్టార్‌గా సాగిన కృష్ణ జర్నీ విశేషాలు మెమోరియల్ ద్వారా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. మెమోరియల్‌ను పద్మాలయ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!