
Raja Saab Teaser Leak:
ప్రభాస్ అభిమానులకు గట్టి షాక్ తగిలింది. “ది రాజా సాబ్” సినిమా టీజర్ విడుదలకి ముందు బాగానే హైప్ క్రియేట్ అవుతోంది. మరీ ముఖ్యంగా జూన్ 16, 2025 ఉదయం 10:52 కి టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అంతకు ముందే ఈ టీజర్ కొంత భాగం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ లీక్ వలన అభిమానుల్లో ఆశ్చర్యం కలిగింది, టీమ్ కి మాత్రం బాగా నిరాశ కలిగింది.
సోషల్ మీడియాలో ఈ లీక్ క్లిప్స్ బాగా వైరల్ అవ్వడంతో మేకర్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎవరైనా ఈ లీక్ వీడియోలను పోస్ట్ చేస్తే గట్టిగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అభిమానులను సపోర్ట్ చేయమని, ఆఫిషియల్ టీజర్ వచ్చేవరకు ఎవ్వరూ లీక్ వీడియోలను చూడకూడదని కోరారు.
ఈ లీక్ అయినా సరే, టీమ్ ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ లోని అజీజ్‌నగర్‌లో ఉన్న ఇండోర్ సెట్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నేషనల్ మీడియా కూడా హాజరవుతుందని సమాచారం. అభిమానులకు ప్రత్యేకమైన “స్పూకీ” అనుభవం ఇవ్వాలని టీమ్ చూస్తోంది. టీజర్ కొన్ని థియేటర్స్‌లో కూడా చూపించబోతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్-కామెడీ మిక్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్స్‌లోకి రానుంది.
ALSO READ: Karthi Kaithi 2 కోసం క్రేజీ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?