HomeTelugu TrendingGreat Indian Kapil Show 3 క్యాస్ట్ నెట్ వర్త్ వివరాలు తెలిస్తే షాకే..

Great Indian Kapil Show 3 క్యాస్ట్ నెట్ వర్త్ వివరాలు తెలిస్తే షాకే..

The Great Indian Kapil Show 3: Full Cast Net Worth REVEALED!
The Great Indian Kapil Show 3: Full Cast Net Worth REVEALED!

Great Indian Kapil Show 3 Cast Net Worth:

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న The Great Indian Kapil Show సీజన్ 3 వచ్చేసింది. ఈసారి మరింత నవ్వులు, పాత జ్ఞాపకాలు, అద్భుతమైన కమెడియన్‌ల రీయూనియన్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది.

ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నవ్జోత్ సింగ్ సిద్ధూ ఐదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనతో పాటు కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్, కృష్ణా అభిషేక్, అర్చనా పురణ్ సింగ్, కికూ శార్డా, రాజీవ్ ఠాకూర్ లాంటి బృందం మళ్లీ కలిసి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. షో షూటింగ్ మొదలైపోయింది కూడా.

ఈ షోలో సంపద పరంగా ముందున్నవాడు కపిల్ శర్మ. ఒక్కప్పుడు చేతిలో రూ.500 మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆయన సంపద రూ.300 కోట్లకు పైగా ఉంది. తన కష్టపాటు వల్ల కామెడీ కింగ్‌గా ఎదిగాడు కపిల్.

ఇతరుల సంపద వివరాలు:

అర్చనా పురణ్ సింగ్: 100కి పైగా సినిమాలు, టీవీ షోలు చేసిన అర్చనాకు రూ.235 కోట్ల సంపద ఉంది.

నవ్జోత్ సింగ్ సిద్ధూ: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సిద్ధూకి రూ.50 కోట్ల సంపద ఉంది.

కృష్ణా అభిషేక్: అతని సంపద రూ.40 కోట్ల వరకు ఉంది.

కికూ శార్డా: రూ.33 నుండి రూ.40 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నాడు.

సునీల్ గ్రోవర్: బాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకున్న సునీల్‌కు రూ.21 కోట్ల సంపద ఉంది.

రాజీవ్ ఠాకూర్: ఆయన సంపద రూ.10 నుండి రూ.12 కోట్ల మధ్య ఉంది.

ఈ షో జూన్ 21, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్స్ వస్తాయి. వీకెండ్ ఎంటర్టైన్‌మెంట్ మళ్లీ మొదలైంది అనుకోవచ్చు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!